ఉమ్మడి జిల్లాలో దీక్షా దివస్ సక్సెస్ అయింది. జిల్లా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమాలకు గులాబీ దళం పోటెత్తింది. ప్రధానంగా నాడు కేసీఆర్ అరెస్టయిన అల్గునూర్లో నిర్వహించిన సభకు వేలాదిగా తరలివచ్చిం ది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని చేసిన ప్రసంగం నూతన చైతన్యానికి నాంది పలికింది. సభకు హాజరైన నాయకులు ఆనాటి విషయాలను గుర్తు తెస్తున్న ప్రతి సందర్భంలోనూ సభ నినాదాలతో మారుమోగింది.
-నమస్తే నెట్వర్క్