Arrangements | వేములవాడ, మార్చి 20: రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేందుకు పరిసరాలను పరిశుభ్రపరచడమే కాకుండా తాగునీరు ఇతర వసతి సౌకర్యాలను సమకూర్చుతున్నామని రాజు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట కమిషనర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ తోటరాజు, తుమ్ మధు, కొండ రాజశేఖర్, నాయకులు సిరిగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.