Flexi arrangement | పాలకుర్తి: పాలకుర్తి మండలం రామారావుపల్లె గ్రామంలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. రామారావు పల్లె గ్రామంలో తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దని, సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, ఎవరూ.. తమ వాడకు రావద్దంటూ ప్లెక్సీ వినూత్నంగా ఏర్పాటు చేశారు. తమ వాడలో 30 సంవత్సరాలుగా సరైన విద్యుత్ సౌకర్యం లేదని, వీధిదీపాలు లేక రాత్రి అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి ఉందని, ఇంటింటికి మీటర్లు లేవని పేర్కొన్నారు.
రోడ్లు ఉన్న విద్యుత్ స్తంభాలు ఉన్నా విద్యుత్ తీగలు లేవని, విద్యుత్ అధికారులను అడిగితే మీరే చలానా కట్టుకోవాలని, విద్యుత్ తీగల కొనుగోలు చేయాలని అంటున్నారని వాపోయారు. మాకు చాలనా కట్టే స్తోమతలు లేదని, ఏ అభ్యర్థి అయినా ఏ పార్టీ వారైనా మాకు సహాయం చేస్తేనే వారికి తమ ఓట్లు, లేకుంటే తమ వాడలో ఓట్ల కోసం ఏ రాజకీయ నాయకులు తమ వాడకు రావద్దంటూ వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.