Peddapally | పెద్దపల్లి, జూన్11: శిశువులకు తప్పనిసరిగా రోటాసిల్ వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారి వైద్య సిబ్బందికి సూచించారు.పెద్దపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శిశువుకు రోటాసిల్ వ్యాక్సిన్ వేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, రోటాసిల్ వ్యాక్సిన్ను 6 వారాల వయస్సు గల శిశువుకు ఓపీవీ, పెంటా వాలెంట్ మొదటి డోసుతో పాటు ఇవ్వాలని సూచించారు.
రెండో డోసు 10 వారాలకు, మూడో డోసు 14 వారాల వయస్సు గల పిల్లలకు నోటి ద్వారా 2 ఎంఎల్ డోసు ఇవ్వాలని, బూస్టర్ డోసు అవసరం లేదని స్పష్టం చేశారు. రోటా వైరస్ సోకిన పిల్లలలో తీవ్ర నీళ్ల విరోచనాలతో పాటు జ్వరం, వాంతులు, కొన్ని సార్లు కడుపు ప్పి కూడా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కిరణ్ కుమార్, స్వాతి భాను, సిబ్బంది పాల్గొన్నారు.