Indurthi | చిగురుమామిడి, జనవరి 29 : చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ మైసూర్ వర్క్ షాప్ కు ఎంపియ్యాడు. ఫిబ్రవరి 2 నుండి 4వ తేదీ వరకు రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మైసూరు లో నేషనల్ కరికులం ప్రేమ్ వర్క్ 2023 ఆధ్వర్యంలో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్స్ ను ఒకటో తరగతి నుండి ఎనిమిదో తరగతి వరకు వివిధ పాఠ్యాంశాలలో ఉన్నటువంటి భావనలకు అనుగుణంగా మెటీరియల్స్ ను ఎలా తయారు చేయాలో నూతన విద్యా విధానం(ఎన్ ఈ పి)లో ఎలా అమలు చేయాలో, అనే అంశాల పైన వర్క్ షాపు నిర్వహిస్తుంది.
ఈ వర్క్ షాప్ కు ఎస్ సి ఆర్ టి హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని ఆరుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కాగా అందులో మన కరీంనగర్ జిల్లా నుండి చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓదేలు కుమార్ ఇందుర్తి పాఠశాల నుండి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను తయారు చేసిన లో కాస్ట్ నో కాస్ట్ తో తయారుచేసిన ప్రయోగాలను ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఎంపిక పట్ల జిల్లా విద్యాధికారి డాక్టర్ అశ్విని తానాజీ వాకిడే, అశోక్ రెడ్డి, భగవంతయ్య, జయపాల్ రెడ్డి, శ్రీనివాసులు, సర్పంచ్ నరేందర్ ,విద్యాధికారి పావని, జిల్లా భౌతిక శాస్త్రం ఫోరం ఓదెల్ కుమార్ ను అభినందించారు.