Indiramma houses | ఓదెల, ఆగస్ట్ 18 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రూపకల్పన చేసిందని, అందుకు అనుగుణంగా లబ్ధిదారులు త్వరితగతిన కట్టుకోవాలని సూచించారు.
ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే వెంట వెంటనే బిల్లులు వస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణాలకు అవసరమైన సామాగ్రిని చౌక ధరలకు ఇప్పించేందుకు ఎమ్మెల్యే విజయ రమణారావు అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చొప్పరి రాజయ్య, ఊడిగా సదయ్య, కందుల సదాశివ్ , తాళ్లపల్లి శ్రీనివాస్ , సిరిసేటి రాహుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.