Odela | ఓదెల, ఆగస్టు 8 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కోరారు. కొలనురు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన పలువురితో కలిసి శుక్రవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న డబ్బులను పొందాలని సూచించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు చౌకగా ఇసుక, ఇటుకలు, మేస్త్రీలను ఏర్పాటు చేయడానికి కృషి జరుగుతుందని వివరించారు. ఇళ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతే తమను సంప్రదించాల్సిందిగా సూచించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే విజయ రమణారావు పనిచేస్తున్నట్టు వివరించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, మాజీ సర్పంచ్ కుంచం మల్లయ్య, దొడ్డే శంకర్, సిరిసేటి రాహుల్, బొంగాని రాజయ్య గౌడ్, పాకాల కరుణాకర్ రెడ్డి ,మడుపు అంజయ్య, మద్దెల రామకృష్ణ, బైరి సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.