Indiramma house construction | పెగడపల్లి: ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టుకోవాలని పెగడపల్లి ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ తో కలిసి ఎంపీడీవో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నిర్మాణం చేసుకునే లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఇంటి నిర్మాణ పనులకు తగ్గట్టు ప్రభుత్వం నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేస్తుందని ఎంపీడీవో స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, నాయకులు ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి, బుర్ర తిరుపతి ఉన్నారు.