కలెక్టరేట్/కార్పొరేషన్/కోర్టుచౌరస్తా/విద్యానగర్/ముకరంపుర/తెలంగాణచౌక్/హుజూరాబాద్/హుజూరాబాద్‌రూరల్/వీణవంక/ సైదాపూర్/ మానకొండూర్/ మానకొండూర్ రూరల్/ చిగురుమామిడి/ చొప్పదండి/ రామడుగు/ గంగాధర/ కరీంనగర్ రూరల్, ఆగస్టు 15 : జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, సొసైటీలు, సంఘాలు, పార్టీల కార్యాలయాల ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేసి, వందనం చేశారు. కాగా, జిల్లా కేంద్రంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జడ్పీ కార్యాలయంలో ప్రత్యేకాధికారి హోదాలో, కరీంనగర్ క్లబ్లో కలెక్టర్ పమేలా సత్పతి జాతీయ జెండాను ఎగురవేశారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ జాతీయ పతాకం ఎగురేసి వందనం సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా రెవెన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు, ఆర్డీవో కె.మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఉద్యోగ సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సుడా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ ప్రపుల్ దేశాయ్, సుడా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కోర్టు భవన సముదాయంలో జిల్లా జడ్జి ఎస్ శివకుమార్ జాతీయ పతాకావిషరణ చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, గవర్నమెంట్ ప్లీడర్లు, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, కమిషనరేట్ పరిపాలనా కార్యాలయం (సీపీవో) వద్ద అడిషనల్ డీసీపీ (పరిపాలన)వెంకటరమణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కరీంనగర్ సరిల్ కార్యాలయంలో ఎస్ఈ మేక రమేశ్ బాబు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మూగ జీవాలను కాపాడుతూ, వాటి రక్షణకు కృషి చేస్తున్న బొమ్మకల్‌కు చెందిన శ్రీ లక్ష్మి జంతు సంరక్షణ శాల అధ్యక్షుడు ఆసిరి సుమన్ కుమార్‌కు జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సోలమన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఉత్తమ సేవలను అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎం భూపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. నగరంలోని కురుమ సంఘం భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కడారి ఐలన్న, డీవైఎఫ్ఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, రైతు ప్రజా సంఘాల సమాఖ్య కార్యాలయంలో ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, తీగలగుట్టపల్లిలో గల నాయీబ్రాహ్మణ కళ్యాణ మండపంలో సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య, తెలంగాణ కార్మిక సమాఖ్య సంఘం కార్యాలయంలో సంఘం అధ్యక్షుడు అంబాల ప్రభాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేశ్ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో కార్యదర్శి నవీన్‌కుమార్, ట్రెజరర్ విజయ్‌కుమార్, సీనియర్ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు.
కరీంనగర్ రూరల్/కార్పొరేషన్, ఆగస్టు 15: దేశ స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో అహింస పద్ధతిలో కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ కేసీఆర్ భవన్‌తో పాటు బొమ్మకల్ బైపాస్‌లోని మున్నూరు కాపు సంఘ భవనంలో స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలో మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు దావు రాజమల్లయ్య, గడ్డం సంపత్, పొన్నం లింగయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.