Independence Day | జగిత్యాల, ఆగస్టు15 : తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ &పెన్షనర్స్ జగిత్యాల జిల్లా శాఖల ఆధ్వర్యంలో 79 వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ జాతీయ పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆరుగురు వయో వృద్ధులకు వినికిడి యంత్రాలను హరి అశోక్ కుమార్ సంఘాల తరఫున అందజేశారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమర స్ఫూర్తితో సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్, అర్బన్ తహసీల్దార్ అరుణ్, సీనియర్ సిటిజెన్స్ జిల్లా కోశాధికారి వేల్ముల ప్రకాష్ రావు, పీసీ హన్మంత రెడ్డి, ఎండీ యాకూబ్, పూసాల అశోక్ రావు, గంగాధర్, నారాయణ, సంజీవ రావు, గంగ రెడ్డి, దుబ్బేష్, దిండిగాల విఠల్, కిషన్, ప్రసాద్, సయ్యద్ యూసుఫ్, సత్యనారాయణ, జలజ, రాధ, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.