Timpapur | తిమ్మాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రసమయిచే అంబేద్కర్, జాగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ
తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను గురువారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత సంఘాల ఆధ్వర్యంలో అనూహ్యంగా ఆవిష్కరించారు.
- పనులు పూర్తి చేసి సుందరీకరణ చేయాలని ఎమ్మెల్యే కవ్వంపల్లికి అల్టిమేటం
Timpapur | తిమ్మాపూర్, జూలై 2 : తిమ్మాపూర్ మండలంలోని ఆర్టీసీ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావ్ విగ్రహాలను గురువారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళిత సంఘాల ఆధ్వర్యంలో అనూహ్యంగా ఆవిష్కరించారు. గత కొన్ని రోజులుగా రాజకీయ రగడ చోటు చేసుకోగా అన్నింటికీ తెర దించుతూ ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విగ్రహాల కోసం పర్మిషన్ వచిందంటూ ప్రకటించారు.
ప్రకటించి ఇన్నాళ్లయినప్పటికీ పనులు చేయడం లేదని ఆరోపిస్తూ దళితులతో కలసి ఆవిష్కరించి, పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. తామే పనులు చేయిస్తామని పనులు చేపట్టారు. గతంలో మండల దళిత సంఘాల నాయకులు కోరడంతో.. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో విద్యార్థులకు స్ఫూర్తిగా ఉండాలని ఉద్దేశంతో తామే ఈ విగ్రహాలను ఏర్పాటు చేశామని, అప్పటి ఎండీ నాగిరెడ్డి పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల విగ్రహాల ఆవిష్కరణ ఆలస్యమైందని చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ ఈ విగ్రహాలపై అలసత్వం ప్రదర్శించారన్నారు. ఇటీవల కాలంలో పర్మిషన్ వచ్చిందని, కోటి నిధులతో సుందరికరణ చేయిస్తానని ప్రకటించిన ఆయన ఇప్పటికీ పనిచేయడం లేదని అందుకే తామే ఆవిష్కరించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. దీనిలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన కూడా కోటితో సుందరీకరణ పూర్తి చేస్తే అందరం కలిసి అంబేద్కర్ జాతర చేసి పండుగ చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడే దళిత సంఘాల నాయకులు దళితులతో కలిసి భోజనాలు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

