బావుల్లో ఈతలు.. చెరువుల్లో చేపల వేట.. నోరూరించే తాటి ముంజలు.. చెరువు గట్ల వద్ద చెంగు చెంగున ఎగిరే మూగ జీవాలు.. ఎండాకాలం వచ్చిందంటే ఇలాంటి అనేక చిత్రాలు మనకు నిత్యం దర్శనమిస్తుంటాయి. పల్లెల్లో క్షణకాలం కనిపించే ఈ దృశ్యాలు అపురూపం, అద్భుతం. ఇవే కాకుండా, తప్పనిసరి పరిస్థితిలో బయటకి వెళ్లేవారు కొందరు గొడుగులతో వెళ్తే.. మరికొందరు తమ చున్నీలు, తువ్వాళలు చుట్టుకుని ఎండ నుంచి రక్షణ పొందుతుంటారు. ఇలాంటి చిత్రాలు గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల ‘నమస్తే’ కెమరాకు చిక్కాయి.