Peddapally | పెద్దపల్లి, మార్చి3: పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేస్తున్నట్లు డాక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలోని తన చాంబర్ గత నెల (ఫిబ్రవరి)లో అందిన వైద్య సేవల వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు. 22,447 మంది ఔట్ పేషెంట్లు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందగా, ఇందులో 9,758 మంది జనరల్ మెడిసిన్ విభాగంలో, 660 మంది జనరల్ సర్జరీ విభాగంలో, 4263 మంది చిన్న పిల్లల విభాగం, 3364 మంది గైనిక్ విభాగం, 410 మంది ఆర్థో విభాగం, 1509 మంది కంటి విభాగం, 675 మంది ఈఎన్టీ విభాగం, 1039 మంది చర్మ విభాగం, 574 మంది దంత విభాగంలో వైద్య సేవలు పొందారని వివరించారు.
అదే విధంగా 1872 మంది ఇన్ పేషెంట్లుగా వైద్య సేవలు పొందగా, ఇందులో 849 మంది జనరల్ మెడిసిన్ విభాగం, 50 మంది జనరల్ సర్జరీ విభాగం, 433 మంది చిన్న పిల్లల విభాగం, 273 గైనిక్ విభాగం, 90 మంది ఆర్థో విభాగం, 174 మంది కంటి విభాగంలో ఇన్ పేషెంట్ వైద్య సేవలు పొందారని తెలిపారు.
అలాగే 54 ఆర్థో శస్త్ర చికిత్సలు, 81 జనరల్ సర్జరీ శస్త్ర చికిత్సలు, 164 కంటి శస్త్ర చికిత్సలు, 25 చెవి ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలు, 409 డెంటల్ శస్త్ర చికిత్సలు అయినట్లు తెలిపారు. అలాగే 184 డెలివరీలు, 27,859 ల్యాబ్ టెస్టులు, 2062 అల్ట్రా సౌండ్ స్కానింగ్, 133 టిఫ్ఫా స్కానింగ్, 722 ఈసీజీ, 255 2డీ ఎకో, 1880 ఎక్స్ రే, 724 ఫిజియో థెరపీ, దాదాపు 700 నవజాత శిశువులకి ట్రీట్మెంట్, 308 ఆరోగ్య శ్రీ సేవలు, 8 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు, 1 యూరాలజీ శస్త్ర చికిత్స, 9 రూట్ కెనాల్ శస్త్ర చికిత్సలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో అందుతున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. వైద్య సేవలలో రోగులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చన్నారు.