కమాన్చౌరస్తా, అక్టోబర్ 8 : నగర శివారులోని తీగెల వంతెనపై ఆదివారం నిర్వహించిన వీకెండ్ మస్తీ అదరహో అనిపించేలా సాగింది. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వీక్షించారు.
ఈ క్రమంలో తీగల వంతెన కిక్కిరిసిపోయింది. బుక్స్టాళ్లు, చిన్నారుల నృత్యాలు, కళాకారుల పాటలు నగరవాసులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.