Odela | ప్రశాంత వాతావరణంలో నిమజ్జోత్సవాలను పూర్తి చేసుకోవాలి.. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మండల కార్యాలయం వద్ద గణేష్ మండపంలో నిర్వాహకులతో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణేశుడు వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
Odela | ఓదెల, సెప్టెంబర్ 22 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మండల కార్యాలయం వద్ద గణేష్ మండపంలో నిర్వాహకులతో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గణేశుడు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణేష్ మండపాల నిర్వాహకులతో మాట్లాడుతూ బుధవారం జరిగే గణేష్ నిమజ్జనం ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచనలు చేశారు.
ముఖ్యంగా ఊరేగింపులో విద్యుత్ ప్రమాదాల జరగకుండా చూసుకోవాలని, అలాగే నిమజ్జనం సందర్భంగా నీటిలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా చిన్న పిల్లలను నీటిలోకి తీసుకు వెళ్లొద్దని చెప్పారు. మత ఘర్షణలు జరగకుండా సంయమనంతో నిమజ్జనం ఉత్సవాలను జరుపుకోవాలని, తమ పోలీస్ బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి, నాంసానిపల్లి సర్పంచ్ గంగిశెట్టి ప్రభాకర్, నాయకులు రాచర్ల రాకేష్, మీనుగు సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

