వీణవంక, జనవరి 29 : ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు! నిబంధనలను కాలరాస్తూ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. కోర్కల్ మానేరు వాగు నుంచి రెడ్డిపల్లి, ఘన్ముక్ల, మల్లన్నపల్లి మీదుగా శంకరపట్నం, హుజూరాబాద్‌కు పగలూ, రాత్రి అనే తేడా లేకుండా తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు.. లైసెన్స్ లేని డ్రైవర్లతో తీసుకెళ్తూ.. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతస్థాయి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని అక్రమ రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.