Pembatla Konapur | సారంగాపూర్, డిసెంబర్ 27: మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా 2023-24 సంవత్సరం గత ప్రభుత్వంలో మూడు సంవత్సరాల క్రితం మండలంలోని పెంబట్ల కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదుల నిర్మాణం, గదుల మరమ్మతులు చేసినప్పటికీ ఇంతవరకు తమకు బిల్లులు రాలేదని తమకు బిల్లులు ఇప్పించాలని కోరుతు శనివారం కాంట్రాక్టర్ కోల శ్రీనివాస్ పాఠశాల హెచ్ఎంకు వినతి పత్రాన్ని అందజేశారు.
గత ప్రభుత్వం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణాలకు రూ. కోటి 35 లక్షలు మంజూరి చేసింది. 2023 అక్టోబర్ లో టెండర్ ప్రకారం అధికారులు త్వరగా పనులు చేయాలని ఒత్తిడి తేవడంతో పనులను ప్రారంభించగా గత ప్రభుత్వంలో మార్చి 23 వరకు 80శాతంబిల్లులు మంజూరి చేసిందని ఇంత వరకు మిగితా బిల్లులు రాలేదన్నారు. 2024, జూలై 13న పాఠశాల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు చదులకు ఇబ్బందులు రాకూడదని భావించి ప్రభుత్వనికి అప్పగించడం జరిగిందని కోల శ్రీనివాస్ పేర్కోన్నారు.
ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు బిలుల్లు మంజూరి చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి మేం చేసిన పని వల్ల ఐదువందల మంది పిల్లలకు మేలు చేశామని కానీ మాకుటుంబం మాత్రం అప్పులపాలై రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. అప్పులు చేసి తరగతి గదుల నిర్మాణాలు, గదుల మరమ్మత్తులు చేపట్టి బిల్లులు రాక బాదపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం, ఎమ్మెల్యే, పై అధికారులు స్పందించి తమకు రావాల్సిన బిల్లులు ఇప్పించాలని కోరారు. జనవరి 10 వరకు బిల్లులు మంజూరి అయ్యోలా చూడాలని లేని పక్షంలో జనవరి 20న తరగతి గదులకు తాళ్లం వేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు.