Siricilla | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ లో సర్పంచ్ గా పోటీ చేసిన పూర్మాని రాజశేఖర్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు పరిచారు. ఎన్నికల సమయంలో గ్రామంలో ఆడ పిల్ల పుట్టినా, వివాహం చేసినా రూ.5 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ మేరకు సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ పూర్తిచేసి, అదే కార్యక్రమం లో గ్రామంలో తొమ్మిది మంది కి రూ.5 వేల చొప్పున రూ.45 వేలు అందించాడు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ, గ్రామ పంచాయతీ పాలక వర్గం చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజశేఖర్ రెడ్డిని ఎంపీడీవో లక్ష్మీనారాయణ, గ్రామసులు సర్పంచి ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోడిసెల అనిల్, మాజీ ఎంపీటీసీ పూర్మాని కనక లక్ష్మీ, కర్నె బాలయ్య, పూర్మాణి రంగ రెడ్డి, పూర్మాణి శ్రీనివాస రెడ్డి, సత్తు రాంరెడ్డి, మోతే మహేష్, తాటిపాముల శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.