Idea Adhurs | పెద్దపల్లి, మే29: పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేస్ట్ మెటియల్ పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిల్స్‌తో అలంకరణ సామగ్రి తయారు చేస్తున్నారు. సందర్శకులను ఆకర్షించే విధంగా మున్సిపల్ కార్యాలయ మొదటి అంతస్తులో పాత టైర్లుతో కుర్చీలు, టీ పాయ్ ఏర్పాటు చేశారు.
అలాగే మొక్కల రక్షణగా గార్డ్ ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు రంగులు వేసి అందులో మట్టి పొసి అలంకరణ మొక్కలు పెంచుతున్నారు. గార్డెన్లో పువ్వులు, పండ్లు, టమాట, వంకాయ, క్యాబేజీ కురగాయల మొక్కలు పెంచతున్నారు. దీంతో సందర్శకులు ఫిదా అవుతున్నారు.