Vemulawada | దండం పెట్టి వేడుకుంటున్న..!.. నా కుటుంబాన్ని రోడ్డున పడేయవద్దని కాంట్రాక్టర్ వెంకటేష్ ఆవేదన
వేములవాడ పురపాలక సంఘంలో పనిచేసిన సివిల్ పనులకు డబ్బులు చెల్లించాలని దండం పెట్టి వేడుకుంటున్నట్లుగా కాంట్రాక్టర్ వెంకటేష్ మాట్లాడిన వీడియో, ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. తనకు ఇచ్చిన రూ.27 లక్షల చెక్కు నగదు ఇప్పించాకే తన పనులు రద్దు చేయాలని వేడుకుంటూ మాట్లాడారు.
- చేసిన పనులకు బిల్లులు చెల్లించాకే పనులు రద్దు చేయండని వేడుకోలు
- వేములవాడలో దయనీయ పరిస్థితులలో కాంట్రాక్టర్లు
Vemulawada | వేములవాడ, అక్టోబర్ 29 : వేములవాడ పురపాలక సంఘంలో పనిచేసిన సివిల్ పనులకు డబ్బులు చెల్లించాలని దండం పెట్టి వేడుకుంటున్నట్లుగా కాంట్రాక్టర్ వెంకటేష్ మాట్లాడిన వీడియో, ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. తనకు ఇచ్చిన రూ.27 లక్షల చెక్కు నగదు ఇప్పించాకే తన పనులు రద్దు చేయాలని వేడుకుంటూ మాట్లాడారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలో రెండో బైపాస్ రహదారిలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారుల కోసం మున్సిపల్ 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.80 లక్షలతో చేపట్టనున్న మార్కెట్ స్టాళ్ల నిర్మాణానికి వెంకటేష్ అనే కాంట్రాక్టర్ రూ.60 లక్షల 65 వేలకు పనులను దక్కించుకున్నారు. మార్చి 31 2025లో పనులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అప్పటి మున్సిపల్ పాలన అధికారితో కలిసి పనులకు శంకుస్థాపన కూడా చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 40 శాతం పనులు పూర్తి చేసిన తర్వాత రూ.27 లక్షల ట్రెజరీ చెక్కును సెప్టెంబర్ 2025లో అందజేశారు. అయితే ట్రెజరీ చెక్కు ఇచ్చినప్పటికీ నగదు రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపివేశారు.
చేయాల్సిన పనులను పూర్తిచేయాలని మున్సిపల్ కార్యాలయ అధికారుల నుండి నోటీసులు కూడా అందజేసినప్పటికీ తాను పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని, బిల్లులు చెల్లిస్తే మొత్తం పని పూర్తి చేసి వెళ్తానని చెప్పుకొచ్చాడు. దీంతో అధికారులు కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన నగదును కేవలం పై అధికారుల మీద నెట్టివేసి తమకు మాత్రం పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో సదర్ కాంట్రాక్టర్ రావలసిన బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే హైకోర్టులో ప్రస్తుతం కొనసాగుతుండగానే మున్సిపల్ పాలకవర్గం వెంకటేష్ చేపట్టిన పనులను రద్దు చేస్తూ తిరిగి కొనసాగించేందుకు పాలకవర్గ సమావేశంలో చర్చించేందుకు అంశాన్ని పొందుపరిచారు. విషయం తెలుసుకున్న సదర్ కాంట్రాక్టర్ వెంకటేష్ గురువారం వీడియోను విడుదల చేశారు. తాను రూపాయి రూపాయి కష్టపడి పనిచేశానని తనకు రావాల్సిన బకాయిలను చెల్లించిన తర్వాతే పనులను రద్దు చేయాలని కోరారు. వేములవాడ ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్‌కు తన కుటుంబాన్ని రోడ్డుమీద పడేయొద్దని, బిల్లులు చెల్లించాకే పనులను అవసరమైతే రద్దు చేయండని ఆడియో పంపారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆవేదన పడుతుండగా ఇప్పించాల్సిన అధికారులు నాయకులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు నిర్దాక్షిణ్యంగా పనులు రద్దులు చేస్తున్నారంటూ పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drone Strike: ఉక్రెయిన్ రైల్వే ఫ్లాట్‌ఫామ్‌పై రష్యన్ డ్రోన్ దాడి.. 13 మంది మృతి
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Megaverse | ‘మెగావర్స్’గా మెగాస్టార్ కొత్త ప్రయాణం.. ‘ అఫీషియల్ ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

