హుజూరాబాద్ టౌన్, మార్చి 29: కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్సేనని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రూ. 4లక్షల విలువ గల ప్రమాద బీమా చెక్కులను శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలను కోల్పోవడం పార్టీకి తీరని లోటన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్లు గందె రాధికాశ్రీనివాస్, తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, బీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, సమ్రిన్ ఖాతుం, నాగపురి శారద, తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు
హుజూరాబాద్ మున్సిపాలిటీ ఆస్తిపన్నుల వసూళ్లలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడంతో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో పాటు మిగతా అధికారులను, సిబ్బందిని శాలువాలతో ఘనంగా సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకుడు గందే శ్రీనివాస్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, జవాన్లు సుధీర్, రాజు, కుమార్, రమేశ్ పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందుకు హాజరు
హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన ఇఫ్తార్ విందులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లింలందరికీ ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్ బాబు, తహసీల్దార్ కనకయ్య, డిప్యూటీ తహసీల్దార్ నవాజ్, ఆర్ఐలు రంజిత్ రెడ్డి, శేఖర్, మసీద్ ఈద్గా కబ్రస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు ముజాహిద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.