Huzurabad | హుజురాబాద్, నవంబర్ 21 : హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల టాప్రా కార్యాలయంలో తాళ్లపల్లి రమేష్ గౌడ్ ఆధ్వర్యం లో బీసీ సమావేశం నిర్వహించి బీసీ జేఏసీ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా చందుపట్ల జనార్ధన్, ఆలేటి రవీందర్, బండారి సదానందం అధ్యక్షుడిగా సంధ్యేల వెంకన్నను ఎన్నుకున్నారు.
అలాగే ఉపాధ్యక్షులుగా ఓడ్నాల ప్రభాకర్, చల్లూరి రఘుచారి, నడిగొట్టిరమేష్, రావుల రాజేష్, ఎగ్గోజు ప్రసాద్, ప్రధాన కార్యదర్సులుగా చిలకమారి శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్, సహాయ కార్యదర్శలుగా ఇప్ప కాయల సాగర్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, గోస్కుల మధుకర్, కూరపాటిరామచంద్రం, మామునూరి ప్రవీణ్, కొలిపాక క్రాంతి కుమార్ నియమితులయ్యారు.
కోశాధికారిగా ఆకుల సదానందం, లీగల్ అడ్వైజర్‌గా యతిపతి అరుణ్ కుమార్, కామణి సమ్మయ్య, ప్రచార కార్యదర్శిగా భారత రజనీకాంత్, గర్రవేణి శ్రీకాంత్, గౌరవ సలహాదారులుగా వడ్లూరు విజయకుమార్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి రమేష్ గౌడ్, కొలిపాక శంకర్, కాజీపేట శ్రీనివాస్ ఎర్ర బొజ్జ నారాయణ, మమ్మద్ కాలిద్ హుస్సేన్, కార్యవర్గ సభ్యులు ఎనగందుల వెంకన్న, చీకట్ల సమ్మయ్య, దొంత హరికిషన్, మామిడి ప్రభాకర్, మహిళా కార్యదర్శి గోస్కుల నాగమణి తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.