Huzurabad | హుజూరాబాద్ టౌన్ , మే 3 : పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. గతంలో హుజూరాబాద్ టౌన్ సీఐ గా పనిచేసిన మాధవి మంచికి మారుపేరుగా నిలచినారని అభిప్రాయపడ్డారు.
ఏసీపీగా అంతకుమించి సామాన్యులకు తమ వంతు సేవలను అందించి, రాష్ట్రంలోనే ఉత్తమ మహిళా పోలీస్ అధికారిగా రాణిస్తారని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ, నియమ నిబంధనలను అనుసరిస్తూ శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఆలేటి రవీందర్, ప్రధాన కార్యదర్శి సందేల వెంకన్న, కోశాధికారి ఆకుల సదానందం, కార్యదర్శి ఉప్పు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ పరందాములు, తాటిపాముల కనకయ్య, ఇప్పకాయల సాగర్, ఇప్పలపల్లి నరేష్, బుర్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.