Judgement | జగిత్యాల క్రైం : మద్యానికి బానిసైన చంద్రయ్య ఓ రోజు మద్యం సేవించిభార్యను హత్య చేసిన ఓ భర్తకు యావజ్జీవ కారాగారా శిక్ష విధిస్తూ జగిత్యాల సెకండ్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నారాయణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని యెకిన్ పూర్ కి చెందిన ఎర్ర చంద్రయ్య అతడి భార్య గంగరాజు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తుండేవారు. భార్య గంగరాజు, అతడి కొడుకును వేధిస్తూ ఉండేవాడు. 29అక్టోబర్ 2022న చంద్రయ్య మద్యం మత్తులో ఇంటి వద్ద ఉన్న గంగరాజు తో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి ఆమె ఒంటి పై ఉన్న బంగారాన్ని తీసుకొని ఆమెను ఒక మూటలో కట్టి యెకిన్ పూర్ గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ లో పడేశాడు.
మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు హత్య చేసిన నిందితుడుడైన చంద్రయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కాగా సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి అదనపు సెషన్స్ జడ్జి సుగాలి నారాయణ నిందితుడైన ఎర్ర చంద్రయ్య పై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదుతో పాటు, రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.