National Flag Rally | జగిత్యాల టౌన్ : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికి చెందిన రామకృష్ణ విద్యాసంస్థలైన రామకృష్ణ డిగ్రీ కళాశాల, NSV డిగ్రీ కళాశాల, NSV జూనియర్ కళాశాల విద్యార్థులతో 550 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో సుమారు 1000 మంది విద్యార్థులు జగిత్యాల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. అతి పొడవైన జాతీయ పతాక ఊరేగింపును పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
జగిత్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాన్ని రామకృష్ణ విద్యాసంస్థలు నిర్వహించడం గర్వకారణం అని , ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, ప్రజలలో దేశభక్తిని పెంచేందుకు తోడ్పడతాయని విద్యాసంస్థల చైర్మన్ యాద రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో NSV జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పల్లెర్ల నరేష్, రామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ కొక్కుల రాజేందర్, NSV డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపు మునిందర్ రెడ్డి, కస్తూరి మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.