peddapally | పెద్దపల్లి టౌన్ జులై 02: పెద్దపల్లి పట్టణంలోని హోటల్లు, బార్ అండ్ రెస్టారెంట్లు వినియోగదారులకు నాణ్యమైన భోజనాలు టిఫిన్లు అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానా ఉదయించినట్లు మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హెచ్చరించారు. పట్టణంలోని హోటల్లు బార్ అండ్ రెస్టారెంట్లను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కిచెన్ రూమ్ లను పరిశీలించి పలు ఆదేశాలు జారీ చేశారు. రెస్టారెంట్లో నిల్వ ఉంచిన చికెన్, మటన్ ను గుర్తించి మిగిలిన చికెన్, మటన్ ను పారవేయాలే తప్ప వినియోగదారులకు పెట్టొద్దని ఆయన హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన రెండు హోటళ్లకు రూ.32వేల జరిమానా విధించారు. జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.