Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 7: ధర్మారం పట్టణ వ్యాపార, వర్తక సంఘం ఉపాధ్యక్షుడు గ బూస లక్ష్మణ్ ను వెల్డింగ్ అస్సోసియేషన్ సభ్యులు ఆదివారం సన్మానించారు. ఇటీవల వ్యాపార, వర్తక సంఘం ఎన్నికలు జరగ లక్ష్మణ్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మన్ ను వెల్డింగ్ షాప్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు .
ఈ కార్యక్రమం లో వెల్డింగ్ యూనియన్ కోశాధికారి కూరపాటి మల్లేశం,ఉపాధ్యక్షుడు గొల్లపెల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి తాటికొండ లక్ష్మణ్,సహాయ కార్యదర్శులు సత్రం శ్రీనివాస్,కోమిరిశెట్టి నర్సన్న, సామంతుల ఓదయ్య, సభ్యులు నడిమెట్ల ప్రవీణ్, మంచికట్ల రమేష్ , కూడికల తిరుపతి, పెద్ది శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు