Sultanabad | సుల్తానాబాద్ రూరల్ జూన్ 13: రైతులు పంటల సాగు ముందు భూసార పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే అధిక అధిక దిగుబడులను సాధించవచ్చని ఏఈఓ రవితేజ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మియాపూర్ గ్రామంలోనీ వ్యవసాయ భూముల్లోని మట్టిని సోమవారం భూసార పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.
జాతీయ సహజ వ్యవసాయం మిషన్ లో భాగంగా ఎంపికైన మియాపూర్ గ్రామంలోని 125 మంది రైతుల పంట పొలాల్లో భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరించి మట్టిని ఫలితాల కోసం భూసార పరీక్ష కేంద్రానికి పంపనున్నట్లు ఏఈఓ రవితేజ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు గ్రామస్తులు తదితరులున్నారు.