MLA Vijayaramana Rao | సుల్తానాబాద్ రూరల్, నవంబర్ 14 : రైతులు పంట మార్పిడీతో నే అధిక దిగుబడులను సాధించవచ్చని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరై ఈ సందర్భంగా మాట్లాడారు.
వరి సాగుతో పాటు ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని రైతులకు సూచించారు. ఇతర దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకోవడం జరుగుతుందన్నారు. మన ప్రాంతంలో కూడా విరివిగా ఆయిల్ పంట సాగు చేసినట్లయితే మేలు జరుగుతుందన్నారు. గత ఎనిమిదేళ్ల నుంచి అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అనురాధ కార్తిలో నారు వేసుకోవాలని సూచించారు. అంతకుముందు సహకార వారోత్సవాల్లో భాగంగా స్థానిక కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, జిల్లా ఉద్యానవన అధికారి జగన్ మోహన్ రెడ్డి, ఆయిల్ ఫామ్ సీవో కేశ కళ్యాణ్, కె వి కే శాస్త్రవేత్త వెంకన్న, ఏఎంసి చైర్మన్ ప్రకాష్ రావు, విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, అసిస్టెంట్ రిజిస్టర్ వెంకటేశ్వర్లు, సీఈఓ సంతోష్, పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.