కరీంనగర్ కోర్టుచౌరస్తా, జనవరి 7: సమాజాభివృద్ధిలో లాయర్ల పాత్ర కీలకమని, ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత వారిపై ఉన్నదని హైకోర్టు జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ అన్నారు. ఈ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆదివారం కరీంనగర్‌లోని కుమారయ్య లా కాలేజీలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళానికి హాజరై మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలని నిర్దేశించారు.
న్యాయవాదులు ఐక్యంగా ఉంటూ ప్రజలకు సేవలందించాలని కోరారు. అనంతరం న్యాయవాదులకు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కుమారయ్య కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ డాక్టర్ కే జలజ, డైరెక్టర్ జీ కృష్ణప్రసాద్, కార్యక్రమ కన్వీనర్ న్యాయవాది ఏ కిరణ్ కుమార్, సీనియర్ న్యాయవాది ఏవీ రమణ, డీఎల్ఎస్ఏ జడ్జి కే వెంకటేశ్, లాయర్లు గుండా భవానీ, పొన్నం రజిత, మంతెన సురేశ్ కుమార్, గాదం స్వామి తేజ, బొంకూరి మోహన్, బండారు గాయత్రీ దేవి, ఎండీ నావజ్, పత్తి శివ ప్రసాద్, వంకాయల రాజ్‌కుమార్, అట్ల ధీరజ్, సావుల రాజమౌళి, ఆడెపు దినేష్, అతికం రాజశేఖర్ గౌడ్, ఎన్నం మమత, తడూరి స్వాతి, బత్తిని స్వప్న, ఉన్నారు.