Kamanpur | కమాన్ పూర్, జనవరి 25 : పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పూర్ మండలంలో గల రొంపికుంట గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన తాటికొండ సత్తయ్య, విమల దంపతుల ఇంటికి ఆదివారం సుందరం పౌండేషన్ వ్యవస్థాపాక అధ్యక్షుడు బోనాల వెంకటస్వామి వెళ్లి వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులుతో పాటు రూ.వెయ్యి ఆర్థిక సాయంగా అందజేశారు.
రొంపికుంట గ్రామానికి చెందిన గన్నెవరపు నర్సయ్య నిరుపేద కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలపడంతోనే ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని తమ వంతుగా సహకారం అందించినట్లు వెల్లడించారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు తమ సుందరం పౌండేషన్ అండగా నిలుస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సుందరం ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కన్నూరి నగేష్, సభ్యులు చెన్నోజు చంద్రశేఖర్, దాసరి రమేష్, సిద్ధు పటేల్ తదితరులు పాల్గొన్నారు.