ఈ చిత్రంలో కనిపిస్తున్నది సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోని రోడ్డు. జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి, పొరండ్ల, శంకులపల్లి, సారంగాపూర్ మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట, రంగపేట, రాయికల్ మండలంలోని ఆలూరు, దావన్‌పల్లి, కట్కాపూర్ గ్రామాల ప్రజలు జగిత్యాలకు వచ్చేందుకు ఇదే ప్రధాన ఆధారం.
అయితే, ఇటీవలి భారీ వర్షాలకు లచ్చక్కపేట వంతెన వద్ద రోడ్డు భారీ కోతకు గురైంది. దీంతో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిశీలించి అధికారులను ఆదేశించడంతో వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపటి రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఎమ్మెల్యేకు సర్పంచ్ రమణారావు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.