నడిరోడ్డుపై సీఐ దాష్టీకం.. దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి కారు డిక్కీలో పడేసీ.. : వీడియో
కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా చేపట్టారు.
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. శాంతియుతంగా నిరసన చేపట్టిన వారిని దౌర్జన్యంగా దాడి చేసి, కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి.. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. కాళ్లు చేతులు పట్టుకుని లాక్కెళ్లి దారుణంగా కారు డిక్కీలో పడేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా షాపులను తొలగించిన మున్సిపల్ అధికారుల తీరుపై కోదాడ ప్రధాన రహదారిపై బాధితులు ధర్నా చేపట్టారు.
ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై సీఐ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. 200లకు పైనే షాపులు ఉండగా కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు షాపును ధ్వంసం చేసి తొలగించారు. దీంతో బాధితులు నిరసన వ్యక్తం చేస్తుండగా సీఐ ఇష్టారాజ్యంగా దాడి చేస్తూ స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

