Bhogi | తాటి ముంజలతో శర్వానంద్.. ‘భోగి’ నుంచి క్రేజీ పోస్టర్ విడుదల!
Bhogi | టాలీవుడ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' నుంచి చిత్ర యూనిట్ తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది.
Bhogi Raksha Bandhan Poster | టాలీవుడ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుంచి చిత్ర యూనిట్ తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. రాఖీ పండుగ సందర్భంగా “గంగ ఒక్కడే… ప్రాణాలు ఐదు” అనే సెంటిమెంట్ క్యాప్షన్‌తో వదిలిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా తెలంగాణ గ్రామీణ వాతావరణంలో సాగే ఈ పోస్టర్లో శర్వానంద్ చేతిలో తాటి ముంజలు కోస్తూ సరికొత్త విలేజ్ మాస్ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో 1960ల నాటి వాతావరణాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
“గంగ” ఒక్కడే… ప్రాణాలు ఐదు❤️
Happy #RakshaBandhan to everyone from Team #BHOGI ❤️🔥#SharwaSampathBloodFest in cinemas soon 🔥 pic.twitter.com/xZBrizgJ6p
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

