అమరావతి : తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ( Accident ) లో 10 మంది ఆర్టీసీ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి( Tirupati ) జిల్లా చెంబడిపాళెం వద్ద తెల్లవారుజామున లారీ టైర్ దెబ్బతిని లారీ జాతీయ రహదారిపై నిలిపి ఉంచగా కర్ణాటక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
దీంతో బస్సులోని 10 మంది తీవ్రంగా గాయపడగా మరో 20 మందికి స్వల్పగాయలయ్యాయి. గాయపడ్డ క్షతగాత్రులను నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.