మల్లాపూర్/ ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 : రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న కోరుట్ల నుంచి జగిత్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. శనివారం మల్లాపూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో 41 మంది లబ్ధిదారులకు 11,92,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం రైతు వేదిక వద్ద 16 మందికి 16,01,856 విలువైన కల్యాణలక్ష్మి, 46 మందికి 13,42,300 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో కల్లబొల్లి మాటలు చెప్పి రైతులను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. చెప్పిన మాట మీద నిలబడకుండా 2 లక్షల రుణమాఫీతోపాటు పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందించడం లేదని విమర్శించారు.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చినా రైతులు, ప్రజలకు ఏనాడూ సంక్షేమ పథకాలను ఆపలేదని గుర్తుచేశారు. త్వరలోనే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు. కల్యాణలక్ష్మి చెక్కులు తాను ఇప్పించానని, ఎవరు పైసలు అడిగినా రాళ్లతో కొట్టాలని మహిళలకు చెప్పారు. తాను చేపట్టే పాదయాత్రకు పార్టీలకతీతంగా నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు సమష్టిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ పాదయాత్రకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరవుతారని తెలిపారు. ఆయా చోట్ల తహసీల్దార్ ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ బద్ధం గోపి, సివిల్ సైప్లె రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉమాపతి, కో ఆపరేటివ్ సొసైటీ ఇన్స్పెక్టర్ నిజామొద్దీన్, ఏవో రాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ కార్యదర్శి సురేందర్, సహకార సంఘం కార్యదర్శి సతీశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు తోట శ్రీనివాస్, ఎలాల దశరథ్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ చైర్మన్ కాటిపల్లి ఆదిరెడ్డి, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ ఎంపీపీలు గౌరు నాగేశ్, నోముల లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు మైదాస్ శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు ఏనుగు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.