Appointed | పెద్దపల్లి రూరల్ జూన్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర, బీసీ విద్యార్థుల సంఘానికి రాష్ట్ర కార్యదర్శిగా పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన పీ హరికృష్ణ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకుల సమక్షంలో నియామక పత్రాన్ని హరికృష్ణ యాదవ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా హరికృష్ణయాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీ సంఘం ఎదుగుదలకు, బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసి బీసీ ల హక్కుల కోసం పోరాడుతానన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తో పాటు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, ఇతర బీసీ సంఘ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హరికృష్ణ నియామకం పట్ల పెద్దపల్లి జిల్లాలోని పలువురు యాదవ సంఘం, యువజన సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.