హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, సబ్బండవర్గాలకు మేలు జరిగిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కొనియాడారు. సోమవారం కేసీఆర్ జన్మదినాన్ని పురసరించుకుని హుజూరాబాద్ కేసీ క్యాంపులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో సుదర్శన హోమంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన మహానేత కేసీఆర్ ఆశయాలు సుసంపన్నం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ, సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించి ప్రజల అభిమానాన్ని పొందారని కొనియాడారు. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ నేతృత్వాన్ని కోరుకుంటున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం అనివార్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి, కూతురు శ్రీనిక రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.