Veenavanka | వీణవంక, ఏప్రిల్ 6 : కిష్టంపేట గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు గొల్లబాతుల కుమారస్వామి (45) ఆదివారం ఫిట్స్ తో మృతి చెందాడు. గ్రామస్తులు, తోటి కార్మికుల కథనం ప్రకారం.. మండలంలోని కిష్ఠంపేట గ్రామానికి చెందిన గొల్లబాతుల కుమారస్వామి కోర్కల్ గ్రామంలోని చేనేత కార్మిక సంఘంలో పని చేస్తున్నాడు.
రోజు వారి వృత్తిలో భాగంగా ఆదివారం ఉదయం చేనేత సంఘానికి వెళ్లిన కుమారస్వామి పని చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు 108 వాహనానికి సమాచారం అందించారు. దీంతో 108 వాహనం వచ్చే లోపే ఫిట్స్‌తో మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు కుమారస్వామికి భార్య, కుమారుడు ఉన్నారు.