Chigurumamidi | చిగురుమామిడి, జనవరి 18 : చిగురుమామిడి మండల కేంద్రంలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ లబ్ధిదారులకు గృహ జ్యోతి పథకం పత్రాలను అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారని, విద్యుత్ ఉద్యోగులతో కలిసి డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క నుండి వచ్చిన గృహ జ్యోతి గ్రీటింగ్స్ ను లబ్ధిదారులకు పంపిణీచేశారు.
విద్యుత్‌ను వినియోగించిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు జీరో బిల్లు కింద ఉచితంగానే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్ర శ్రీనివాస్, దాసరి ప్రవీణ్, కక్కర్ల సంపత్, ట్రాన్స్‌కో లైన్ ఇన్స్పెక్టర్ దాసరి రాములు, లైన్మెన్ ఆడెపు లక్ష్మీనారాయణ, సామ్రాజ్యం, రాకేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.