భళా.. హస్తకళ
సృజనాత్మకతకు పదును పెడుతున్నారు ఆ చిన్నారులు. స్కూల్లో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆలోచనలకు రూపమిస్తున్నారు. హ్యాండ్ క్రాఫ్ట్‌లో రాణిస్తూ పనికిరాని వస్తువులతో అపురూపాలను తయారుచేస్తున్నారు
- ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ
- హ్యాండ్క్రాఫ్ట్లో రాణిస్తున్న బాలికలు
- పనికానికి వస్తువులతో అపు‘రూపాలు’
వేములవాడ, డిసెంబర్ 01 : సృజనాత్మకతకు పదును పెడుతున్నారు ఆ చిన్నారులు. స్కూల్లో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ ఆలోచనలకు రూపమిస్తున్నారు. హ్యాండ్ క్రాఫ్ట్‌లో రాణిస్తూ పనికిరాని వస్తువులతో అపురూపాలను తయారుచేస్తున్నారు. గ్రీటింగ్స్, ఇంట్లో అలంకరణ వస్తువులు రూపొందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు వేములవాడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను మెరుగుపరుస్తూ మెళకువలతో కూడిన శిక్షణ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తుండగా ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. వేములవాడ పట్టణంలోని ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 8వతరగతి విద్యార్థులకు హ్యాండ్‌క్రాఫ్ట్ శిక్షణ ఇస్తున్నారు. వారంలో ఒక్కో తరగతికి మూడు పీరియడ్ల చొప్పున తర్ఫీదునిస్తున్నారు. శిక్షణ పొందిన విద్యార్థులకు వారి నైపుణ్యతను బట్టి వంద మార్కుల వరకు వేస్తున్నారు. సైన్స్‌ఫేర్ లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు క్రాఫ్ట్ మేళాను నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. దీంతో విద్యార్థినులు తమలోని సృజనాత్మతకు బయటికి తీస్తున్నారు. ఆలోచనలకు పదును పెడుతూ ఎన్నో పనికిరాని వస్తువులను అపురూపంగా తీర్చిదిద్దారు. మట్టి వినాయకులు, కాగితపు పూలతో బతుకమ్మ, ఇంట్లో పెట్టుకునే అందమైన డెకరేషన్ వస్తువులను రూపొందిస్తున్నారు. పండుగలకు శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్ కూడా స్వయంగా తయారు చేసుకుంటున్నారు.
ప్రోత్సహిస్తున్నాం
6 నుంచి 8తరగతి విద్యార్థినులకు మాత్రమే హ్యాండ్‌క్రాఫ్ట్ శిక్షణ ఇస్తున్నాం. ఎన్నో మెళకువలు నేర్పుతున్నాం. అందమైన వస్తువులను తయారుచేసే విధంగా ప్రోత్సహిస్తున్నాం. విద్యార్థినులు కూడా ఆసక్తి చూపుతున్నారు. తమ ఆలోచనలను పదును పెడుతున్నారు.
– స్వరూపరాణి, క్రాప్ట్ టీచర్ బాలుర ఉన్నత పాఠశాల (వేములవాడ)
బతుకమ్మను తయారు చేసిన
పోయిన బతుకమ్మ ఉత్సవాల సమయంలో పనికిరాని కాగితాలతో అందమైన బతుకమ్మను తయారు చేసిన. చాలా బాగా వచ్చింది. ఇంకా చాలా ఐటమ్స్ తయారు చేస్త. ఈ శిక్షణ నాకు చాలా ఉపయోగపడుతుంది.
– సంజన, 8వ తరగతి విద్యార్థిని (వేములవాడ)
శిక్షణ బాగున్నది..
చదువుకుంటూనే శిక్షణ తీసుకుంటున్నం. ఆటవిడుపుగా అందిస్తున్న ఈ శిక్షణ ఎంతో బాగున్నది. మాలోని ఆలోచనలకు పదును పెడుతున్నం. నేను కాగితాలతో కూడిన పువ్వులను తయారు చేసిన. చాలా బాగున్నయ్ అని అందరు అన్నరు.
– యామిని, 8వ తరగతి విద్యార్థిని (వేములవాడ)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

