Sarangapur | సారంగాపూర్, జూన్ 11: బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో హమాలీలను అభినందిస్తు వారిని సన్మానించారు. గ్రామంలో బీర్పూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయడంపై హమాలీలు నిరంతరం పనిచేయడం వల్లె ధాన్యం కొనుగోల్లు వేగవంతం పూర్తి అయ్యయని సర్పంచ్ అన్నారు.
వారి పనితీరును మెచ్చుకుని ఈ సందర్భంగా హమాలీలను సన్మానించారు. సెంటర్ నిర్వహకులు కూడ త్వరితగితన పూర్తి చేయడంపై అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేడీసీసీబీ డైరెక్టర్, బీర్పూర్ సహకార సంఘం చైర్మెన్ ముప్పాల రాంచంధర్ రావు, ఉప సర్పంచ్ లింగన్న, కందెనకుంట సర్పంచ్ నర్సయ్య, వార్డు సభ్యులు రాజశేఖర్, తిరుపతి, లక్ష్మణ్, శ్రీనివాస్, మహేష్, నాయకులు దోసారపు బుచ్చన్న, కిషన్, రాజు, సీఈఓ అయ్యోరి తిరుపతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.