తిమ్మాపూర్,మార్చి29 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామస్తులు ధర్నాకు దిగి లొల్లి చేశారు. వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు.స్టేజ్ వద్ద డివైడర్,బారికేడ్లు ఏర్పాటు సరిగా లేకనే యాక్సిడెంట్లు అయి ప్రాణాలు పోతున్నాయని.. వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం గ్రామస్తులు ధర్నా చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ఎల్ఎండీ ఎస్ఐ అన్వర్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను విరమింప చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | తప్పు చేయకపోతే భయమెందుకు?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన కేటీఆర్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్