సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఏడుగురి దుర్మరణం
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో ముంబై హైవేపై మంగళవారం రాత్రి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, దవాఖానకు తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..
- సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి
జహీరాబాద్, ఆగస్టు 11 : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొగుడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో ముంబై హైవేపై మంగళవారం రాత్రి ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఐదుగురు కూలీలు, ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, దవాఖానకు తరలిస్తుండగా మరొకరు మృతిచెందారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరికి చెందిన కూలీలు మంగళవారం పనికోసం ఆటోలో జహీరాబాద్ ప్రాంతానికి వచ్చారు. సాయంత్రం పనులు ముగించుకుని తిరిగి ఆటోలో బయలుదేరారు.
ఈ క్రమంలో హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై మొగుడంపల్లి మండలం సత్వార్ సమీపంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ ఆటోను ఢీకొట్టాడు. ఘటనలో రేఖ, శ్రీదేవి, దేవదాస్, కవిత, రేష్మతోపాటు ఆటోడ్రైవర్ దేవదాస్ దుర్మరణం చెందారు. నిఖితను దవాఖానకు తరలిస్తుండగా మరణించింది. తీవ్రంగా గాయపడిన నిర్మల, తుల్జమ్మ, చంద్రకళ, రాధిక, శిల్ప, శోభను జహీరాబాద్ ఏరియా దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి సంగారెడ్డి, హైదరాబాద్ దవాఖానలకు తరలించారు. ప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
Siddhu 10 | సిద్ధు జొన్నలగడ్డ 10వ సినిమా ప్రారంభం.. సుకుమార్ రైటింగ్స్‌తో చేతులు కలిపిన స్టార్ బాయ్!
Kolkata-Sairang Express: ఎమర్జెన్సీ బ్రేక్స్ కోసం ఇంజిన్ డ్రైవర్ ప్రయత్నం.. అస్సాం రైలు ప్రమాదం వీడియో వైరల్
Satavahana University | కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం : వీడియో
Dada | ‘దాదా’లో సింగర్‌గా మారిన బాలయ్య.. ‘దాదా ధమాకా’లో నందమూరి నటసింహం స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

