Kuchipudi | కోల్ సిటీ , ఏప్రిల్ 26: గోదావరిఖనిలోని నృత్యఖని ఆర్ట్స్ అకాడమిలో శనివారం గజ్జె పూజ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. గత సంవత్సరం కాలంగా కూచిపూడి నాట్యంలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి అర్హత పొందిన కళాకారులకు ఈ గజ్జె పూజ నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా చిన్నారులకు నాట్య గురువు గుమ్మడి ఉజ్వల తన స్వహస్తాలతో గజ్జెలు తొడిగింది. తర్వాత మొదటి నాట్యంను ఆ పరమ శివునికి అంకితం చేశారు.
అనంతరం పిల్లలకు కళా ప్రవేశ సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారి కళాకారులు నాట్య గురువు నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం పూజారి శేఖర్, అకాడమి చిన్నారులు మౌక్తిక, ఉద్వితారాధ్య, శ్రీవల్లి, ఉపాగ్న, లౌఖ్యతోపాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అత్యంత ప్రాచీన కళా వైభవంకు ప్రతీకగా ఉన్న కూచిపూడి నాట్య రంగంలో తమ పిల్లలకు ప్రాథమిక విద్యను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపి అభినందించారు.