Handball competitions | వెల్గటూర్, ఏప్రిల్ 19 : ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం నాగరాజు, చొప్పరి అరవింద్ లు జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. గత నెల 2న హ్యాండ్బాల్ అసోసియేషన్ తెలంగాణ ( HAI ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ జూనియర్ బాలుర విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు.
కాగా ఈ నెల 20 నుండీ 24 వరకు ఉత్తరప్రదేశ్ లోని అక్బర్ పుర్ లో జరిగే 47వ జూనియర్ జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో వీరు పాల్గొంటారు. వీరి ఎంపిక పట్ల ఎంఈఓ రామచంద్రం, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావు, మాజీ సైనికులు ముదుగంటి వెంకటరమణారెడ్డి, ఓజ్జల మహేష్, ఎండి ఆఫీజ్, ట్రెసలర్ర్ శ్రీను, సంయుక్త కార్యదర్శి అశోక్, పీడీ భుమేష్, సీనియర్ క్రీడాకారులు బాస మహేష్, జైనపురం సాయికుమార్, మౌనిక, సన, అక్షయ్ ప్రజాప్రతినిదులు అభినందించారు.