BJP group politics | పెద్దపెల్లి టౌన్, జులై 7 : పెద్దపెల్లి నియోజకవర్గంలో బీజేపీలో గుజ్జుల రామకృష్ణారెడ్డి అతడి అనుచరులు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని అభాసుపాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చీరాలపు పర్వతాలు ఆరోపించారు. నందన గార్డెన్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
పార్టీ పిలుపునందుకుని క్రమశిక్షణతో దుగ్యాల ప్రదీప్ కుమార్ అతడి అనుచరులు పార్టీ పటిష్ట కోసం పనిచేస్తుంటే గిట్టని గుజ్జుల వర్గం వేసిన కమిటీలను మళ్లీ వేస్తూ పార్టీ క్రమశిక్షణ దెబ్బతీస్తున్నారని ఆవేదన చెందారు. పరస్పర ఆరోపణలతో బీజేపీ పరువు పోతుందే తప్ప వ్యక్తుల పరువుపోదని దీన్ని గ్రహించాలని గుజ్జుల వర్గానికి హితువు పలికారు.
ఇప్పటికైనా గుజ్జుల వర్గం బీజేపీ పరువు తీయకుండా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజేష్, రమేష్, రాజగోపాల్, ఈర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.