Pegadapally | పెగడపల్లి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో గోలి రాజేందర్ రెడ్డి అనే రైతుకు చెందిన జామ తోట ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దద్దమైంది. గ్రామ సమీపంలోని తన వ్యవసాయ భూమిలో రాజేందర్ రెడ్డి రెండు ఎకరాల్లో జామ తోటను సాగు చేశారు.
ఆదివారం ఉదయం తోట పక్కనే వదులుగా ఉన్న తీగలు గాలికి చెట్టుకు తగలడంతో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి జామ తోటకు అంటుకున్నట్టు తెలిపారు. దీంతో రెండు ఎకరాల్లోని జామ తోట పూర్తిగా దగ్ధమైందని బాధిత రైతు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం చేసే ఆదుకోవాలని రైతు రాజేందర్ రెడ్డి కోరారు.