Chendurti | చందుర్తి, మే 20 : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, మినీ స్టేడియం, నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసి రైతులకు నీటి నిల్వలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కటుకం మల్లేశం, ఏఎంసీ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, ఉప సర్పంచ్ ఇసాక్, నాయకులు గోట్టే ప్రభాకర్, నాగం కుమార్, చింతపంటి రామస్వామి, ముస్కు మల్లారెడ్డి, దూది శ్రీనివాస్ రెడ్డి, సంతపూరి బాలకృష్ణ రెడ్డి, ఏనుగు లచ్చిరెడ్డి, లింగంపల్లి బాబు,కుమ్మరి స్వామి గ్రామస్తులు పాల్గొన్నారు.