Green India | కాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 20 : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రలోని శ్రీ జగత్ మహా మునీశ్వర స్వామి ఆలయం, శ్రీ సీత రామచంద్ర స్వామి ఆలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఆర్డినేటర్ సతీశ్, హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్పాల రాజేశ్వరరావు, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డితో కలిసి ఆలయాల జమ్మి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కోట్లాది మొక్కలు నాటి దేశానికే పచ్చదనం పెపొందించడం జరుగుతుందని అన్నారు. అలాగే గుడికో జమ్మి చెట్టులో భాగంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో జమ్మి మొక్కలను నాటుతున్నామని తెలిపారు. అంతరించిపోతున్న చెట్లను కాపాడుకోవడంలో భాగంగా సంప్రదాయంలో బాగంగా జమ్మి మొక్కలను నాటడం ప్రారంభించామని, ప్రతీ గ్రామంలో ప్రతీ ఆలయంలో జమ్మి చెట్లు నాటుతున్నామని వెల్లడించారు.
అలాగే ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా తీసుకొని మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ నాయకులు ఆడెపు రాజు, సుధాటి కర్ణాకర్ రావు, నిదానపురం దేవయ్య, జూకంటి శిరీష, రంజిత్ రెడ్డి, చెప్పాల శ్రీకాంత్ రావు, జలింగం రఘు, దర్ముల రవి, తదితరులు పాల్గొన్నారు.